
మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. సరైన విధంగా ఉపయోగిస్తే ఈ పోషకాలు మన శరీరానికి అందుతాయి.అయితే..కేవలం మన శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. కుదుళ్ల నుంచి కురులను బలంగా ఉంచుతుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో జుట్టు రాలిపోకుండా కాపాడుకోవడం అంత సింపుల్ కాదు. ఇందు కోసం చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. చాలా మంది జుట్టు ఒత్తుగా పెరగడానికి ఎన్నో హెయిర్ సీరమ్స్, షాంపూలు, కండీషనర్స్ ఉపయోగిస్తుంటారు. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగానే వినియోగిస్తుంటారు. కొన్ని సార్లు ఈ ప్రొడక్ట్స్ వల్లే త్వరగా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ చిట్కా గురించి మనం తెలుసుకుందాం…
మునగాకు ప్రయోజనాలు..
మునగాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచగలిగే గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకులకు చాలా ప్రాధాన్యం ఉంది. ఎన్నో శతాబ్దాలుగా మునగాకుని ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఉన్న ఇన్ ఫ్లమేషన్‌ని తగ్గించి, ఇమ్యూనిటీని పెంచడంలో మునగాకు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రధానంగా స్కాల్ప్ హెల్త్‌ని కాపాడుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడంలో ఇవి తోడ్పడతాయి. జుట్టు పెరుగుదల కోసం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్లు ఇప్పుడు చెప్పిన విధంగా మనుగాకును ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎలా వాడాలంటే…
మునగాకులో విటమిన్ Aతో పాటు జింక్ అధికంంగా ఉంటుంది. ఈ రెండు స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముందుగా మునగాకును పొడిగా చేసుకోవాలి. పెరుగు లేదా అందుబాటులో ఉంటే ఆలివ్ ఆయిల్ తీసుకోని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి కనీసం అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
ఎలా పని చేస్తుంది..
మునగాకులో ఇందాక చెప్పిన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ పైన వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని తగ్గిస్తాయి. ఇదే సమయంలో స్కాల్ప్‌ని చాలా శుభ్రంగా ఉంచుతాయి. ఫాలికల్స్‌కి సరైన విధంగా పోషకాలను అందిస్తాయి. మరో రకంగా కూడా మునగను జుట్టు ఆరోగ్యానికి ఉపయోగించవచ్చు. అది ఎలాగంటే.. మునగ నూనె కూడా మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. మునగ గింజల నుంచి ఈ నూనె తయారు చేస్తారు. ఈ నూనెలో ఒమెగా 9 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో బెహెనిక్ యాసిడ్ కూడా ఉంటుంది. వీటిని జుట్టు చాలా త్వరగా గ్రహిస్తుంది. ముందుగా ఓ టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ మేర మునగ నూనె తీసుకోవాలి. దాన్ని కాస్తంత వేడి చేయాలి. ఇది గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ ఆయిల్‌ని స్కాల్ప్‌కి బాగా పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచినా పరవాలేదు. మరుసటి రోజు తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
ఆయిల్ ఎలా పనిచేస్తుంది..?
ఈ నూనె అప్లై చేసి సరైన విధంగా మసాజ్ చేయాలి. దీని వల్ల వెంట్రుకలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. పైగా ఇందులో తేమ గుణం ఎక్కువగా ఉంటుంది. బాగా పొడిగా ఉండే వెంట్రుకలకు ఇది తేమ అందిస్తుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. లేదా మునగాకు పొడిని వేసి మరిగించినా.. సరిపోతుంది. ఇలా మరిగిన నీటిని చల్లారే వరకూ అలాగే ఉంచాలి. ఆ తరువాత మీ జుట్టు కుదుళ్లకు దీన్ని పట్టించి, ఆ తరువాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
షాంపూ ఎలా పని చేస్తుంది..?
ఇది కుదుళ్ల నుంచి సరైన విధంగా జుట్టు పెరిగేలా చూస్తుంది. అన్ని రకాల పోషకాలను జుట్టు పెరుగుదలకు అందిస్తుంది. జుట్టును మృదువుగా మార్చడంతో పాటు మెరుపుని అందిస్తుంది. సప్లిమెంట్స్ రూపంలో వీటిని తీసుకోవచ్చు. కాకపోతే ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
We Media Telugu is a digita media platform dedicated to delivering timely, accurate, and engaging content in Telugu. We cover trending stories from across Andhra Pradesh, Telangana, India, and the world. Our mission is to provide reliable information and meaningful stories that keep our audience informed and connected.




