
Anasuya bharadwaj grace with attitude
అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)బహుశా ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో.టెలివిజన్, సినిమా రంగాల్లో తనదైన స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ….సోషల్ మీడియాలో ఏదో ఓ రచ్చ చేసి ట్రెండింగ్ అవుతుంటుంది.కాదు…కాదు…ట్రెండింగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది.40 ఏళ్ళ వయసు పై బడిన తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకునే అనసూయా… సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేందుకు పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్తుటుంది.అనసూయను డిజిటల్ బ్రాండింగ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పవచ్చు.సోషల్ మీడియాలో లెటెస్ట్ పోస్ట్‌లు చేస్తూ ఫోలోవర్స్ పెంచుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్న అనసుయా… ఇటీవల నటుడు శివాజీ చేసే వాఖ్యల విషయంలో తలదూర్చి సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ను పెంచుకోనే ప్రయత్నం చేస్తోంది.నటుడు శివాజీ తను చేసిన వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పినా కూడా అనసూయ వదలకుండా అటు శివాజీకి, నెటిజన్లును కౌంటర్ ఎటాక్ చేస్తూనే ఉంది.నెటిజెన్స్ కు అనసూయ కాస్త గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.కానీ సోషల్ మీడియాలో అనసూయ పై ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు.నెటిజన్లు కూడా అనసూయకు కాస్తా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.
అనసూయ అన్‌స్టాబుల్ స్ట్రాటజీ అదుర్స్….
యాంకర్ ఇమేజ్‌ను దాటి.. కొత్త బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అనసూయా..ఏదో ఓ వివాదంలో వేలు పెట్టి …కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేస్తూ ఎపుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలగడం, విమర్శలు వస్తాయనే భయంతో వెనక్కి తగ్గకపోవడం అనసూయకు ఉన్న ప్రధాన బలం.ట్రోలింగ్,నెగెటివ్ కామెంట్స్ వచ్చినా పూర్తిగా కుంగిపోకుండా నేనేంటో…నాకు తెలుసు అనే మైండ్ సెట్‌తో ముందుకు వెళ్తుండం అనసూయలో స్పష్టంగా కనిపిస్తుంది .సోషల్ మీడియాలో తన పై వచ్చే విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ గట్టిగానే సమాధానం చెబుతూ తనది స్ట్రాంగ్ మెండ్ సెట్ అని క్లియర్‌గా చెప్పకనే చెబుతోంది.అనసూయ లాంటి వారు భావోద్వేగల విషయంలో నిలకడగా ఉండటం, సోషల్ ప్రెజర్‌ను తట్టుకోవడం,స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఓ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంటారని అభిప్రాయపడుతున్నారు సైకాలజిస్ట్‌లు.సైకాలజిస్ట్‌లు చెప్పిన విధంగా ఇవన్నీ అనసూయలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.ముఖ్యంగా ఇటీవల మహిళల వస్త్రధారణలో నెటిజన్లు చేసిన విమర్శలు విషయంలో అనసూయ ఎక్కడా కూడా తగ్గ లేదు.ప్రతి విమర్శల దాడి చేసింది.పైగా… తనకు నచ్చిన విధంగా డ్రెస్‌లు వేసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి…నేనింతే… అని సమాధానం ఇచ్చేసింది .
అయితే సోషల్ మీడియాలో అనసూయను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళంతా ఆమె ఫోలోవర్స్ యే.పైగా ఆమెను ఆన్ ఫాలో చేయకపోగా…ఆమె పెట్టే ఫోటోలు, పోస్ట్‌లకు లైక్‌లు కొడుతూ షేర్ చేస్తూ అనసూయకు ఫోలోవర్స్‌ను మరింత పెంచేస్తున్నారు.అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా అనసూయను ఎపుడు ట్రెండింగ్‌లో ఉంచేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది ఆమెను విమర్శించే ఆమె ఫాలోవర్లే కావడం గమనార్హం..!అంటే… అనసూయను విమర్శించే వాళ్ళు,తిట్టే వాళ్ళే రంగమ్మ అత్త స్థాయిని మరింత పెంచేందుకు, ట్రెండింగ్‌లో ఉంచేందుకు తెగ కష్టపడుతున్నారన్న మాట .సోషల్ మీడియాలో అనసూయ చేసే వాఖ్యలకు తెగ స్పందించేసి…ఆమె ట్రాప్‌లో గుడ్డిగా పడిపోయి ఆమెకు ఫాలోవర్లను పెంచే పనిలో బిజీగా గడిపేస్తూ తమ సమయాన్ని వృదా చేసుకుంటున్నారన్నది మరిచిపోతున్నారు.తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ అనసూయకు ఫాలోయింగ్ పెంచేందుకు తెగ కష్టపడిపోతున్నారు.అనసూయ మాత్రం తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా,ఈజీగా ఓ వైపు డబ్బును.. మరో వైపు ఫోలోవర్స్ పెంచుకుంటూ కొత్త క్రేజ్ ను సంపాదించుకుంటుంది.
అనసూయ.. ది సోషల్ గురు..!
ప్రపంచ జనాభాలో దాదాపు 40% మంది సోషల్ మీడియాలో బ్రతికేస్తున్నారు.రోజుకు సగటున రెండు గంటలకు పైగా ఇందులోనే గడుపుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి.చాలా మంది జీవితాల్లో ఇప్పుడు సోషల్ మీడియా ఒక ప్రధాన భాగంగా మారిపోయింది.నిజానికి సోషల్ మీడియా చేస్తున్న మేలు కంటే..కీడే ఎక్కువని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ మనుషుల మధ్య సునీతత్వాన్ని చంపేస్తుందని… మొత్తం సమాజాన్ని ఏదో తెలియని అంధకారం సోషల్ మీడియా రూపంలో కమ్మేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.చాలా కార్పొరేట్ కంపెనీలు,సోషల్ మీడియాను ఇన్ఫ్లూయెన్స్ చేసే పర్సన్స్..తమ ఫోలోవర్స్ ఎంత ఎక్కువ స్క్రీన్ టైం గడిపితే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది.అందుకే ఫోలోవర్స్ ను పెంచుకోవడమే లక్ష్యంగా పని చేస్తుంటారు.సోషల్ ప్లాట్ ఫామ్ పై ఫోలోవర్స్ ను అట్రాక్ట్ చేసేందుకు చేసేందుకు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయసర్లు ఇలా చేస్తూ ఆదాయాన్ని,పేరును సంపాదించుకుంటున్నారు.సరిగ్గా ఇదే స్ట్రాటజీని అప్లై చేస్తూ సోమ్ము చేసుకుంటుంది అనసూయ.ఎపుడు ఏదో ఒక కాంట్రావర్సీలో అనసూయ తలదూర్చి..తన ఇన్ఫ్లూయెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.దీంతో కమర్షియల్ యాడ్స్,ఈవెంట్స్ షాప్ ఓపెనింగ్స్,టివి ప్రోగ్రామ్స్, సినిమా ఛాన్స్ లు పెరిగే అవకాశం ఉంది. వీటి ద్వారా మరింత ఆదాయం పెరుగుతుంది.అందుకే అనసూయ సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉంటుంది.
ఒక్క అనసూయ మాత్రమే కాదు.సోషల్ మీడియాలో ఎంతో కొంత పేరున్న వారంతా ఇదే చేస్తూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.కానీ.. అనసూయ మాత్రం ఈ విషయంలో చాలా ఎక్స్పర్ట్.సోషల్ మీడియాను వాడుకుంటూ తన ఇన్ఫ్లూయెన్స్ ను పెంచుకోవడమే కాకుండా బాగానే క్యాష్ చేసుకుంటుంది.సాక్షి న్యూస్ ఛానల్ యాంకర్‌గా తన కెరియర్ మొదలు పెట్టిన అనసూయ.. ఆ తర్వాత అనేక రకాల టీవీ షోలు చేశారు.ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయింది.ఆ షో అనసూయ జీవితాన్నే మార్చేసింది. ఆమెకు సినిమా అవకాశాలు దక్కేలా చేసింది.స్టార్ యాంకర్‌గా ఎదిగేందుకు సహాయ పడింది.ఇక అప్పటి నుంచి సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఉపయోగించుకుంటూ ట్రెండింగ్ లో ఉంటూ ఇపుడు మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటుంది.ఇదంతా అనసూయ సోషల్ స్ట్రాటజీ ప్రకారం చేస్తుందని.. బుర్ర ఉన్న ప్రతి వారికి ఇట్టే అర్థం అవుతుంది.కానీ…ఇక్కడే చాలా మందికి అర్దం కావాల్సిన ఓ విషయం ఉంది.అనసూయ ఆడుతున్న మైండ్ గేమ్ లో పావులుగా మారి..తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియాలో వృధా చేసుకుంటూ అనసూయ చేస్తున్న కాంట్రావర్సీకి ఓవర్ రియాక్ట్ అవుతూ..అనసూయను మరింత ట్రెండింగ్ చేస్తున్నారు.ఇదే అనసూయ ట్రెండింగ్ స్ట్రాటజీ..!హ్యాట్స్ ఆఫ్ టు అనసూయ.అందుకే అనసూయ..ది సోషల్ గురు..!
We Media Telugu is a digita media platform dedicated to delivering timely, accurate, and engaging content in Telugu. We cover trending stories from across Andhra Pradesh, Telangana, India, and the world. Our mission is to provide reliable information and meaningful stories that keep our audience informed and connected.


